Wednesday, 30 December 2020

ఘనమైనవి నీ కార్యములు Ghanamainavi Nee Karyamulu Song Lyrics in Telugu|New 2021 Hosanna Ministries

        
           Here We Upload Track Song "Sing With Your Own Voice" 🎤
    
Free Download Track Song 
➡️➡️➡️➡️Click Here To Download⬅️⬅️⬅️⬅️

 ఘనమైనవి నీ కార్యములు Song Lyrics

Telugu Lyrics: 

ఘనమైనవి నీ కార్యములు నా యెడల 
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య (2)

కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి
స్తుతులర్పించెదను అన్నివేళలా (2)

అనుదినము నీ అనుగ్రహమే
అయుష్కాలము నీ వరమే (2) ||ఘనమైనవి||

1. ఏ తెగులు సమీపించనీయక
    ఏ కీడైన దరిచేరనీయక
    ఆపదలన్ని తొలగేవరకు
    ఆత్మలో నెమ్మది కలిగే వరకు
    నా భారము మోసి బాసటగా నిలిచి ఆధరించితివి
    ఈ స్తుతిమహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం
                                                     ||ఘనమైనవి||
2. నాకు ఎత్తైన కోటవు నీవే
    నన్ను కాపాడు కెడేము నీవే
    ఆశ్రయమైన బండవు నీవే
    శాశ్వత కృపకాధరం నీవే
    నా ప్రతిక్షణమును నీవు దీవెనగా మార్చి
    నదిపించుచున్నవు
    ఈ స్తుతిమహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం
                                                      ||ఘనమైనవి||
3. నీ కృపతప్ప వేరొకటి లేదయా..
    నీ మనసులో నేనుంటే చాలయా..
    బహుకాలముగా నేనున్న స్థితిలో 
    నీ కృప నా యెడ చాలునంటివే
    నీ అరచేతిలో నన్ను చెక్కుకొంటివి నాకేమీ కొదువ
    ఈ స్తుతిమహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం
                                                      ||ఘనమైనవి||
  

4 comments:

  1. దేవునికి స్తోత్రం కలుగును గాక.
    మీ పనికి తగిన ప్రతిఫలం దేవుడు దయచేయును గాక.
    కొన్ని అక్షర దోషాలు ఉన్నాయి వాటిని సరిచేయండి.
    ముఖ్యంగా ప్రతి చరణం చివరి వరుసలో
    "ఈ స్తుతి మహిమ"అని ఉండాలి.

    ReplyDelete
  2. Nice song my god bless Hosanna ministerees

    ReplyDelete