నీ ప్రేమ నాలో Nee Prema Naalo Song - 2020 Hosanna Ministries Songs
Lyrics :
నీప్రేమ నాలో మధురమైనది - అది నా ఊహకందని క్షేమశిఖరము ఏరికోరుకున్నావు ప్రేమ చూపినన్ను - పరవశించినాలో మహిమపరతు నిన్నే
సర్వ కృపానిధివి నీవు - సర్వాధికారిని నీవు
సత్యస్వరూపివి నీవు - ఆరాధింతును నిన్నే
1. చేరితి నిన్నే అడిగిన మనస్సుతో - కాదనలేదే నా మనవులు నీవు
హృదయమునిండిన గానం - నను నడిపే ప్రేమకావ్యం
నిరతము నాలో నీవే- చెరగని దివ్యరూపం
ఇది నీబాహుబంధాల అనుబంధమా?
తేజోవిరాజ స్తుతిమహిమలు నీకే - నా యేసురాజా ఆరాధన నీకే
2. నా ప్రతి పదములో జీవము నీవే- నా ప్రతి అడుగులో విజయము నీవే ఎన్నడువిడువని ప్రేమ - నిను చేరే క్షణమురాదా
నీడగ నాతో నిలిచే - నీకృపయే నాకు చాలును
ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా?
తేజో విరాజ స్తుతి మహిమలు నీకే - నాయేసురాజ ఆరాధన నీకే
3. సింహాసనము నను చేర్చుటకు - శిలువను మోయుట నేర్పించితివి
కొండలు లోయలు దాటే - మహిమాత్మతో నింపినావు
దయగల ఆత్మతో నింపి - సమభూమిపై నడిపినావు
ఇది నీ ఆత్మబంధముకై సంకేతమా?
తేజోవిరాజ స్తుతి మహిమలు నీకే- నా యేసురాజా ఆరాధన నీకే