నీవే హృధయసారది Song Lyrics
నీవే హృధయసారది ప్రగతికి వారధి |2|
నీ స్నేహమే సౌభాగ్యము సంక్షేమ సంతకం
నా పాటకే సౌందర్యము నీవే యేసయ్యా |నీవే|
1. మదిలో చేదు జ్ఞాపకాల విలయ వేదిక కూల్చి
చిగురకుల దిశగా నను పయనింపచేసినా
నీ మాటలు స్థిరపరిచిన విశ్వాస ప్రేమలో
కలనైనా అనుకొని అనురాగ బంధమైతివే...|నీవే|
2. నీవు లేని జీవితం కలయ సాగరమే
దిక్కు తోచని సమయములో నీవే దిక్సూచివై
చుక్కానిగా నడిపించుము ఆత్మీయ యాత్రలో
కనుపాపగా నను కాచిన నా మంచి కాపరి...|నీవే|
3. చేరనైతి కోరనైతి స్నేహ సౌధము
చిరుదివ్వెగ దరిచేరి చేర్చావు సన్నిధి
చావైన బ్రతుకైన నీకోసమే ప్రభు
చాటింతును నీ ప్రేమను ప్రనుతింతును ప్రేమ సాగరా..|నీవే|
No comments:
Post a Comment