నాలో నివసించే నా యేసయ్యా Naalo Nivasinche Naa Yesayya Song - 2020 Hosanna Ministries Song Lyrics
Lyrics :
నాలో నివశించే నా యేసయ్యా
మనోహర సంపద నీవేనయ్యా
మారని మమతల మహనీయుడా
కీర్తించి నిన్నే ఘనపరతునయ్య
మనసార నిన్నే ప్రేమింతునయ్య
మధురమైనది నీ స్నేహబంధం - మహిమగా నను మార్చిన వైనం
నీ చూపులే నను కాచెను - నీ బాహువే నమ మోసెను
ఏమిచ్చి నీ ఋణము నేతీర్చను
కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా
మనసార నిన్నే ప్రేమింతునయ్య
వినయభావము ఘనతకు మూలం- నూతన జీవములో నడుపుమార్గం
నా విన్నపం విన్నావులే- అరుదించెలే నీ వరములే
ఏమని వర్ణింతు నీ కృపలను
కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా!
మనసార నిన్నే ప్రేమింతునయ్య
మహిమగలది నీదివ్యరాజ్యం - తేజోవాసుల పరిశుద్ధ స్వాస్థ్యం
సీయోనులో చేరాలనే నాతశయం నెరవేర్చును
యేసయ్య నినుచూచి హర్షింతునే
భువినేలు రాజా నీకే నా వందనం
దివినేలు రాజా వేలాది వందనం!!