Friday, 12 March 2021

నా దాగుచోటు Naa Dhaguchotu Song Lyrics in Telugu|Hosanna Ministries 2021 New Songs Lyrics in Telugu


                   నా దాగుచోటు Song Lyrics

నా దాగుచోటు నీవే యేసయ్యా
నా విచారములు కొట్టివేసి - ఆనందము కలుగజేసితివి
నాహృదయములో నదివలే సమాధానమే నలుదిశల నెమ్మదిని కలుగజేసితివే

1. తగిన సమయములో హిచ్చించునట్లు నను దాచి కాచితివి
దీనమనస్సు కలిగి జీవింప నీకృపనిచ్చితివి
నా చింతలన్ని బాపి నీ శాంతితో నింపితివి
నా హృదయములో నదివలే సమాధానమే నలుదిశల నెమ్మదిని కలుగజేసితివే
                                               ||నా దాగు చోటు॥
2. ఆపత్కాలములో పర్ణశాలలో నను నీవు దాచితివి
నా సహాయకుడ నీవని నే నాట్యమాడి కీర్తింతును నా జీవితకాలమంతయు నీ సన్నిధిని నివసింతును
నా హృదయములో నదివలే సమాధానమే నలుదిశల నెమ్మదిని కలుగజేసితివే
                                                ||నా దాగుచోటు||

3. అగ్నిశోధనలు నను చుట్టుకొనగా దాచితివి
నీ కౌగిలిలో స్నేహబంధముతో బంధించి నను ప్రేమించితివి
జేష్ఠుల సంఘముకై నను సిద్ధపరచితివి
నా హృదయములో నదివలే సమాధానమే
నలుదిశల నెమ్మదిని కలుగజేసితివే
                                               ||నా దాగు చోటు॥




No comments:

Post a Comment