Monday, 8 March 2021

ఎవరో నన్నిలా Evaro Nannila Song Lyrics in Telugu|Hosanna Ministries 2021 Song Lyrics


ఎవరో నన్నిలా Song Lyrics in Telugu

ఎవరో నన్నిలా మార్చినది - యెడబాయని కృప చూపినది
ఎవరూ చూపని అనురాగమును - ఏదో తెలియని ఆప్యాయతను చూపించినది - ఇంకెవరూ?
ఇదే కదా ప్రేమ యేసయ్య ప్రేమ - మధురమైన ప్రేమ దివ్యమైన ప్రేమ

1. దేహమే దేవుని ఆలయమేనని - దేవుని ఆత్మకు నిలయము నేనని 
మలినము కడిగి ఆత్మతోనింపి - సమముద్రించి శుద్ధహృదయము కలిగించినది రాకడ కొరకే
                                                         ||ఇదే కదా||

2. మార్గము తెలియక మౌనము వీడక వేదన కలిగిన నను విడనాడక 
ప్రేమతో చేరి గమ్యము చూపి - ఒంటరి చేయక జంటగ నిలచి వేదవబాధలు తొలగించినది 
                                                         ||ఇదే కదా||

3. చీకటికమ్మిన చెలిమివాకిట - చెదరిన మనస్సుతో ఒంటరినై 
సత్యము నమ్మక మమతను వీడి - ఎన్నడు ప్రభుని స్వరమును వినక శిలగా మారిన నను మార్చినది                                         ||ఇదే కదా||



 

No comments:

Post a Comment