Friday, 13 March 2020

నీ ప్రేమ నాలో Nee Prema Naalo Song lyrics in Telugu - 2020 Hosanna Ministries Songs




నీ ప్రేమ నాలో Nee Prema Naalo Song - 2020 Hosanna Ministries Songs

Lyrics : నీప్రేమ నాలో మధురమైనది - అది నా ఊహకందని క్షేమశిఖరము ఏరికోరుకున్నావు ప్రేమ చూపినన్ను - పరవశించినాలో మహిమపరతు  నిన్నే సర్వ కృపానిధివి నీవు - సర్వాధికారిని నీవు సత్యస్వరూపివి నీవు - ఆరాధింతును నిన్నే 1. చేరితి నిన్నే అడిగిన మనస్సుతో - కాదనలేదే నా మనవులు నీవు హృదయమునిండిన గానం - నను నడిపే ప్రేమకావ్యం నిరతము నాలో నీవే- చెరగని దివ్యరూపం ఇది నీబాహుబంధాల అనుబంధమా? తేజోవిరాజ స్తుతిమహిమలు నీకే - నా యేసురాజా ఆరాధన నీకే 2. నా ప్రతి పదములో జీవము నీవే- నా ప్రతి అడుగులో విజయము నీవే ఎన్నడువిడువని ప్రేమ - నిను చేరే క్షణమురాదా నీడగ నాతో నిలిచే - నీకృపయే నాకు చాలును ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా? తేజో విరాజ స్తుతి మహిమలు నీకే - నాయేసురాజ ఆరాధన నీకే 3. సింహాసనము నను చేర్చుటకు - శిలువను మోయుట నేర్పించితివి కొండలు లోయలు దాటే - మహిమాత్మతో నింపినావు దయగల ఆత్మతో నింపి - సమభూమిపై నడిపినావు ఇది నీ ఆత్మబంధముకై సంకేతమా? తేజోవిరాజ స్తుతి మహిమలు నీకే- నా యేసురాజా ఆరాధన నీకే



No comments:

Post a Comment