Saturday, 14 March 2020

NEEVE KRUPAADHAARAMU నీవే కృపాధారముత్రియేక దేవా SONG LYRICS IN TELUGU||HOSANNA MINISTRIES NEW YEAR SONG 2020 LYRICS |

HOSANNA MINISTRIES NEW YEAR SONG 2020 LYRICS | NEEVE KRUPAADHAARAMU 

నీవే కృపాధారముత్రియేక దేవా SONG LYRICS IN TELUGU



నీవే కృపాధారముత్రియేక దేవా
నీవే క్షేమాధారము నా యేసయ్యా (2)
నూతన బలమును నవ నూతన కృపను (2)
నేటివరకు దయచేయుచున్నావు – నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
ఈ స్తోత్ర గీతము నీకేనయ్యా … (నీవే)
  1. ఆనందించితిని అనురాగ బంధాల ఆశ్రయపురమైన నీలో నేను (2)
    ఆకర్షించితివి ఆకాశముకంటె ఉన్నతమైన నీ ప్రేమను చూపి (2)
    ఆపదలెన్నో అలముకున్నను – అభయము నిచ్చితివి
    ఆవేదనల అగ్నిజ్వాలలో అండగ నిలచితివి
    ఆలొచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు
    నీకే ఈ ప్రేమగీతం అంకితమయ్యా
    ఈ స్తోత్ర గీతం అంకితమయ్యా (2) (నీవే)
  2. సర్వకృపానిధి – సీయోను పురవాసి – నీ స్వాస్థ్యముకై నను పిలచితివి (2)
    సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను – సహనము కలిగి (2)
    శిధిలముకాని సంపదలెన్నో నాకై దాచితివి
    సాహసమైన గొప్ప కార్యములు నాకై చేసితివి
    సర్వశక్తి గల దేవుడవై నడిపించుచున్నావు
    నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా – ఈ స్తోత్ర గీతము నీకేనయా (నీవే)
  3. ప్రాకారములను దాటించితివి – ప్రార్ధన వినెడి పావనమూర్తివి (2)
    పరిశుద్ధులతో నను నిలిపితివి – నీ కార్యములను నూతన పరచి (2)
    పావనమైన జీవనయాత్రలో విజయము నిచ్చితివి
    పరామరాజ్యములో నిలుపుటకొరకు అభిషేకించితివి
    పావనుడా నా అడుగులు జారక స్థిరపరచినావు
    నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా – ఈ స్తోత్ర గీతము నీకెనయా (నీవే)







No comments:

Post a Comment