Friday, 12 March 2021

నా దాగుచోటు Naa Dhaguchotu Song Lyrics in Telugu|Hosanna Ministries 2021 New Songs Lyrics in Telugu


                   నా దాగుచోటు Song Lyrics

నా దాగుచోటు నీవే యేసయ్యా
నా విచారములు కొట్టివేసి - ఆనందము కలుగజేసితివి
నాహృదయములో నదివలే సమాధానమే నలుదిశల నెమ్మదిని కలుగజేసితివే

1. తగిన సమయములో హిచ్చించునట్లు నను దాచి కాచితివి
దీనమనస్సు కలిగి జీవింప నీకృపనిచ్చితివి
నా చింతలన్ని బాపి నీ శాంతితో నింపితివి
నా హృదయములో నదివలే సమాధానమే నలుదిశల నెమ్మదిని కలుగజేసితివే
                                               ||నా దాగు చోటు॥
2. ఆపత్కాలములో పర్ణశాలలో నను నీవు దాచితివి
నా సహాయకుడ నీవని నే నాట్యమాడి కీర్తింతును నా జీవితకాలమంతయు నీ సన్నిధిని నివసింతును
నా హృదయములో నదివలే సమాధానమే నలుదిశల నెమ్మదిని కలుగజేసితివే
                                                ||నా దాగుచోటు||

3. అగ్నిశోధనలు నను చుట్టుకొనగా దాచితివి
నీ కౌగిలిలో స్నేహబంధముతో బంధించి నను ప్రేమించితివి
జేష్ఠుల సంఘముకై నను సిద్ధపరచితివి
నా హృదయములో నదివలే సమాధానమే
నలుదిశల నెమ్మదిని కలుగజేసితివే
                                               ||నా దాగు చోటు॥




Tuesday, 9 March 2021

అమరుడవు నీవు Song Lyrics in Telugu|Hosanna Ministries 2021 Song Lyrics in Telugu


 అమరుడవు నీవు Song Lyrics in Telugu

అమరుడవు నీవు నా యేసయ్యా - ఆదియు అంతము నీవేనయ్యా
ఆదిలోనున్న నీ వాక్యమే - ఆదరించెను శ్రమకొలిమిలో
సొమ్మసిల్లక - సాగిపోదును - సీయోను మార్గములో
స్తోత్రగీతము - అలపింతును - నీదివ్య సన్నిధిలో

1. శక్తికి మించిన సమరములో - నేర్పితివి నాకు నీ చిత్తమే
శిక్షకు కావే శోధనలన్నీ - ఉన్నత కృపతో నను నింపుటకే
ప్రతి విజయము నీకంకితం - నాబ్రతుకే నీ మహిమార్థం
లోకమంతయు - దూరమైనను - ననే చేరదీసిదవు దేహమంతయు - ధూళయైనము - జీవింపజేసిదవు                           ||అమరుడవు||

2. వేకువకురిసిన చిరుజల్లులో - నీకృప నాలో ప్రవహించగా
పొందితినెన్నో ఉపకారములు - నవనూతనమే ప్రతిదినము
తీర్చగలనా నీఋణమును - మరువగలనా నీప్రేమను
కన్నతండ్రిగ - నన్ను కాచి - కన్నీరు తుడిచితివి కమ్మనైన - ప్రేమ చూపి - కనువిందు చేసితివి
                                                   ||అమరుడవు||

3. జల్దరు వృక్షమును పోలిన - గుణశీలుడవు నీవేనయ్యా
మరణము గెలిచిన పరిశుద్ధుడవు - పునరుత్థానుడవు నీవయ్యా
జయశీలుడవు నీవేనని - ఆరాధింతును ప్రతి నిత్యము
గుండె గుడిలో - నిండినావు - నీకే ఆరాధన
ఆత్మదీపము - వెలిగించినావు - నీకే ఆరాధన
                                                   ||అమరుడవు||


Monday, 8 March 2021

ఎవరో నన్నిలా Evaro Nannila Song Lyrics in Telugu|Hosanna Ministries 2021 Song Lyrics


ఎవరో నన్నిలా Song Lyrics in Telugu

ఎవరో నన్నిలా మార్చినది - యెడబాయని కృప చూపినది
ఎవరూ చూపని అనురాగమును - ఏదో తెలియని ఆప్యాయతను చూపించినది - ఇంకెవరూ?
ఇదే కదా ప్రేమ యేసయ్య ప్రేమ - మధురమైన ప్రేమ దివ్యమైన ప్రేమ

1. దేహమే దేవుని ఆలయమేనని - దేవుని ఆత్మకు నిలయము నేనని 
మలినము కడిగి ఆత్మతోనింపి - సమముద్రించి శుద్ధహృదయము కలిగించినది రాకడ కొరకే
                                                         ||ఇదే కదా||

2. మార్గము తెలియక మౌనము వీడక వేదన కలిగిన నను విడనాడక 
ప్రేమతో చేరి గమ్యము చూపి - ఒంటరి చేయక జంటగ నిలచి వేదవబాధలు తొలగించినది 
                                                         ||ఇదే కదా||

3. చీకటికమ్మిన చెలిమివాకిట - చెదరిన మనస్సుతో ఒంటరినై 
సత్యము నమ్మక మమతను వీడి - ఎన్నడు ప్రభుని స్వరమును వినక శిలగా మారిన నను మార్చినది                                         ||ఇదే కదా||



 

Saturday, 6 March 2021

నా యెదుట నీవు Naa Yedhuta Neevu Song Lyrics in Telugu|Hosanna Ministries 2021 New Songs Lyrics


నా యెదుట నీవు Song Lyrics in Telugu 

నా యెదుట నీవు - తెరచిన తలుపులు 
వేయ లేరుగా - ఎవ్వరు వేయలేరుగా 
నీవు తెరచిన తలుపులు
1. రాజుల రాజ - ప్రభువుల ప్రభువా 
నీకు సాటి - ఎవ్వరు లేరయా 
నీ సింహాసనం - నా హృదయాన 
నీ కృపతోనే - స్థాపించు రాజా ||నా యెదుట||
2. కరుణామయుడా - కృపాసనముగా 
కరుణా పీఠాన్ని - నీవు మార్చావు 
కృప పొందునట్లు - నాకు ధైర్యమిచ్చి 
నీ సన్నిధికి - నన్ను చేర్చితివా ||నా యెదుట||
3: ప్రధానయాజకుడా - నా యేసురాజా 
నిత్చ యాజకత్వము - చేయుచున్నవాడా యాజకరాజ్యమైన - నిత్య సీయోను 
నూతన యెరూషలేం - కట్టుచున్నవాడా 
                                                    ||నా యెదుట||

Thursday, 4 March 2021

దీనుడా అజేయుడా Dheenuda Ajeyuda Song Lyrics in Telugu|Hosanna Ministries 2021 Songs Lyrics

 


దీనుడా అజేయుడా Song Lyrics

దీనుడా అజేయుడా - ఆదరణ కిరణమా
పూజ్యుడా పరిపూర్ణుడా - ఆనంద నిలయమా
జీవదాతవు నీవని శృతిమించి పాడనా జీవధారవు నీవని కానుకనై పూజించనా
అక్షయ దీపము నీవే - నా రక్షణ శృంగము నీవే స్వరార్చన చేసెద నీకే - నా స్తుతులర్పించెద నీకే

1. సమ్మతిలేని సుడిగుండాలే - ఆవరించగా
గమనములేని పోరాటాలే- తరుముచుండగా
నిరుపేదనైన నాయెడల - సందేహమేమి లేకుండా హేతువేలేని - ప్రేమ చూపించి - సిలువచాటునే దాచావు

సంతోషము నీవే - అమృత సంగీతము నీవే స్తుతిమాలిక నీకే - వజ్రసంకల్పము నీవే |దీనుడా|

2. సత్య ప్రమాణము నెరవేర్చుటకే - మార్గదర్శివై
నిత్యనిబంధన నాతో చేసిన - సత్యవంతుడా
విరిగి నలిగిన మనస్సుతో - హృదయార్చనే చేసేద కరుణనీడలో - కృపావాడలో - నీతో ఉంటే చాలయ్యా

కర్తవ్యము నీవే- కనుల పండుగ నీవేగా
విశ్వాసము నీవే - విజయశిఖరము నీవేగా |దీనుడా|

3. ఊహకందని ఉన్నతమైనది - దివ్యనగరమే
స్పటికము పోలిన సుందరమైనది - నీ రాజ్యమే
ఆ నగరమే లక్ష్యమై - మహిమాత్మతో నింపినావు అమరలోకాన - నీసన్నిధిలో - క్రొత్త కీర్తనే పాడెదను

ఉత్సాహము నీవే - నయనోత్సవం నీవేగా ఉల్లాసము నీలో - ఊహలపల్లకి నీవేగా                          |దీనుడా|


నీవే హృధయసారది ప్రగతికి వారధి Neeve Hrudhayasaradhi Song Lyrics in Telugu|Hosanna Ministries 2021 Songs Lyrics

 


నీవే హృధయసారది Song Lyrics

నీవే హృధయసారది ప్రగతికి వారధి |2|

నీ స్నేహమే సౌభాగ్యము సంక్షేమ సంతకం

నా పాటకే సౌందర్యము నీవే యేసయ్యా |నీవే|


1. మదిలో చేదు జ్ఞాపకాల విలయ వేదిక కూల్చి

చిగురకుల దిశగా నను పయనింపచేసినా

నీ మాటలు స్థిరపరిచిన విశ్వాస ప్రేమలో

కలనైనా అనుకొని అనురాగ బంధమైతివే...|నీవే|


2. నీవు లేని జీవితం కలయ సాగరమే

దిక్కు తోచని సమయములో నీవే దిక్సూచివై

చుక్కానిగా నడిపించుము ఆత్మీయ యాత్రలో

కనుపాపగా నను కాచిన నా మంచి కాపరి...|నీవే|


3. చేరనైతి కోరనైతి స్నేహ సౌధము

చిరుదివ్వెగ దరిచేరి చేర్చావు సన్నిధి

చావైన బ్రతుకైన నీకోసమే ప్రభు

చాటింతును నీ ప్రేమను ప్రనుతింతును ప్రేమ సాగరా..|నీవే|